Spokes Person Warangal District Congress Committie

Friday, October 6, 2017

ప్రకటనలకే పరిమితమవుతున్న తెరాస ప్రభుత్వంపై మండిపడ్డ వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకూస్



నేడు (05-10-2017) కాజిపేట్ ప్రెస్ మీడియా పాయింట్ లో కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్వే పీరియాడికల్ ఓవరాయిలింగ్ షెడ్ (POH), కాజిపేట్ రైల్వే డివిజన్ కేంద్రం, కాజిపేట్ బస్ స్టాండ్ మరియు చిరువ్యాపారుల షాపుల సముదాయం (హాకర్స్ జోన్) మరిచిన తెరాస ప్రభుత్వంపై కాజిపేట్ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నిధుల మంజూరి జీవోను చూపిస్తూ రైల్వే పీవోహెచ్ షెడ్ కు స్థలం ఇస్తామని హడావుడి సంబరాలు చేస్తూ ప్రకటనలు చేస్తున్న దానిపై కార్యరూపంలో చిత్తశుద్ధి చూపించాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకూస్ డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా మహమ్మద్ అంకూస్ మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధి కి ప్రతి ఏటా 300 కోట్ల నిధులు మంజూరుచేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏటా మూడువందల కోట్ల చొప్పున మూడు ఏండ్లకు ఎన్ని కోట్లు విడుదల చేసారు, ఎన్ని పనులు చేసారు మరియు ఏం పనులు చేసారో శ్వేతా పత్రం విడుదల చేయాలనీ, డబుల్ బెడ్ రూంలు ఏమైనాయని, వరంగల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏమైందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడాహుడి జీవోలు ప్రకటనలు సంబరాలు మానుకొని పనులు కార్యరూపంలో తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఉపేందర్, సిటీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోహర్, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు యాకూబీ, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శాంతిప్రియ, నగర కాంగ్రెస్ కార్యదర్శి ఇప్ప శ్రీకాంత్, మూలుగురి ఈశ్వర్, NSUI నాయకులూ మహమ్మద్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Today's (06-10-2017) Newspaper Clippings...